ఆ హీరో వల్లే నేను పెళ్లిచేసుకోలేదు.. నటి టాబు షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా : మూడు దశాబ్దాలపాటు సినిమాలు చేస్తూ ఇండస్ర్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న స్టార్ హీరోయిన్ టాబు.. తన పెళ్లి విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. 50 ఏళ్లు దాటుతున్న ఇంకా సింగిల్‌గానే ఉండటానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ అని చెప్పి నెటిజన్లకు, ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న టాబు తన మ్యారేజ్ లైఫ్‌ గురించి వివరిస్తూ.. ‘అజ‌య్ దేవ్‌గ‌ణ్ నేను 13 -14 ఏళ్ల […]

Update: 2021-11-06 01:46 GMT

దిశ, సినిమా : మూడు దశాబ్దాలపాటు సినిమాలు చేస్తూ ఇండస్ర్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న స్టార్ హీరోయిన్ టాబు.. తన పెళ్లి విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. 50 ఏళ్లు దాటుతున్న ఇంకా సింగిల్‌గానే ఉండటానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ అని చెప్పి నెటిజన్లకు, ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.

ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న టాబు తన మ్యారేజ్ లైఫ్‌ గురించి వివరిస్తూ.. ‘అజ‌య్ దేవ్‌గ‌ణ్ నేను 13 -14 ఏళ్ల వ‌య‌సునుంచే మంచి స్నేహితులం. అజ‌య్ త‌న సోద‌రుడు కూడా మా స్నేహితుడే. మేమంతా జుహులోనే క‌లిసి పెరిగాం. నేను ఎక్కడికి వెళ్లినా అజ‌య్ నన్ను ఫాలో అయ్యేవాడు. నాతో ఎవ‌రైనా అబ్బాయిలు మాట్లాడితే అస్సలు స‌హించేవాడు కాద‌ు. వాళ్లతో గొడవ పెట్టుకునేందుకు సిద్ధప‌డేవాడు’ అని తెలిపిన టాబు.. అలాగే ఎప్పుడూ త‌న‌ను ఓ కంట క‌నిపెడుతూ, ఫాలో అయ్యేవాడని, అతడి వల్లే పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా మిగిలిపోయానని, కానీ పెద్దయ్యాక తను పెళ్లి ప్రస్థావనే ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Tags:    

Similar News