ఉల్లికి ఆధార్ నంబర్ లింక్

దిశ, వెబ్‌డెస్క్: కడప రైతు బజారులో ఉల్లి విక్రయాలు మొదలయ్యాయి. దీంతో సోమవారం ఉదయం రైతు బజారు వద్ద కొనుగోళ్ల కోసం ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండటంతో కేజీ ఉల్లి ధర రూ.40లకు విక్రయిస్తున్నారు. అయితే ఆధార్ కార్డు ఉన్న వ్యక్తికే ఒక కేజీ ఉల్లిపాయలు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. అంతేగాకుండా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల […]

Update: 2020-10-26 01:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కడప రైతు బజారులో ఉల్లి విక్రయాలు మొదలయ్యాయి. దీంతో సోమవారం ఉదయం రైతు బజారు వద్ద కొనుగోళ్ల కోసం ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండటంతో కేజీ ఉల్లి ధర రూ.40లకు విక్రయిస్తున్నారు. అయితే ఆధార్ కార్డు ఉన్న వ్యక్తికే ఒక కేజీ ఉల్లిపాయలు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. అంతేగాకుండా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఉల్లి విక్రయాలు జరుగుతాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా గతకొన్ని రోజులుగా ఉల్లిపాయల ధరలు పెరగుతుండటంతో సామాన్యుడిపై మరింత భారం పడిన విషయం తెలిసిందే.

 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News