మాంసం దుకాణల వద్ద సామాజిక దూరం తప్పనిసరి

దిశ, నల్లగొండ: మాంసం దుకాణాల వద్ద సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఆదివారం మాంసం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బయటకు వచ్చిన ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని ఆమె సూచించారు. అదే విధంగా మటన్, చికెన్ దుకాణాదారులు […]

Update: 2020-05-02 11:05 GMT

దిశ, నల్లగొండ: మాంసం దుకాణాల వద్ద సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఆదివారం మాంసం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బయటకు వచ్చిన ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని ఆమె సూచించారు. అదే విధంగా మటన్, చికెన్ దుకాణాదారులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, లేనియేడల కఠిన చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్ హెచ్చరించారు.

tags: collector anita ramachandran, meat shops, keep maintain social distance

Tags:    

Similar News