ఈటలతో చనువుగా కేకే.. కౌగిలింతతో ఆందోళన చెందుతోన్న బీజేపీ (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేందర్ అక్రమాల‌కు పాల్పడ్డారని మంత్రివర్గం నుంచి బ‌ర్తర‌ఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే బీజేపీలో చేరడం, ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించడం వెంట వెంటనే జరిగిపోయాయి. దీంతోపాటు ఈటలకు టీఆర్ఎస్ నేతలతో దూరం పెరగడంతో పాటు వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు విమర్శలు సైతం చేసుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్‌లో […]

Update: 2021-12-12 07:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేందర్ అక్రమాల‌కు పాల్పడ్డారని మంత్రివర్గం నుంచి బ‌ర్తర‌ఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే బీజేపీలో చేరడం, ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించడం వెంట వెంటనే జరిగిపోయాయి. దీంతోపాటు ఈటలకు టీఆర్ఎస్ నేతలతో దూరం పెరగడంతో పాటు వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు విమర్శలు సైతం చేసుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్‌లో ఈటలకు సన్నిహితులు ఉన్నా.. అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. అయితే, తాజాగా ఆదివారం జరిగిన ఓ శుభకార్యంలో అధికార టీఆర్ఎస్ నేతలతో పాటు ఈటల రాజేందర్‌ కూడా పాల్గొన్నారు. ఫంక్షన్‌లో సుదీర్ఘకాలం తర్వాత ఈటలను చూసిన టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావు ఆప్యాయంగా ఈటలను హత్తుకున్నారు. భజంమీద చెయ్యి వేసి ప్రేమగా మాట్లాడారు.

అయితే, ఈ కలయిక ఈటల అభిమానులను, బీజేపీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర దాగుందని అనుమానిస్తున్నారు. అదేమిటంటే.. ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ విస్తృత వ్యాప్తంగా మూలంగా ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ వైరస్ పట్ల అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర సర్కార్ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతికదూరం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పాటు మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

అయితే, ఆదివారం ఈటలను కలిసి టీఆర్ఎస్ నేత కే.కేశవరావు ముందు మాస్కుతో ఈటలను హత్తుకొని, అనంతరం మాస్కు తీసి, అదే మాస్కుతో సరదాగా ఈటల మూతిపై కొట్టడం ఈటల వర్గీయులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకరి మాస్కును మరొకరు పట్టుకోవడానికే జంకుతున్న పరిస్థితుల్లో, మాస్కుతో ఏకంగా మూతిపై కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా.. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర దాగుందని, ప్లాన్ ప్రకారమే కే.కేశవరావు మాస్కుతో కొట్టించారని, కరోనాతో ఈటలను ఆసుపత్రి పాలు చేయాలనేదే వారి కుట్ర అని ఆరోపిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News