పీవీ ఒక శిఖరం.. పీవీ శతజయంతి ఉత్సవాల్లో కేసీఆర్

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబద్ నెక్లెస్ రోడ్డులో 16 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళసైతో కలిసి సీఎం కేసీఆర్ అవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ పీపీ ఒక శిఖరమని కొనియాడారు. విగ్రహాన్ని చూస్తుంటే పీవీని చూసినట్టే ఉందన్నారు. అంతేకాకుండా నవోదయవంటి విద్యాసంస్థలను ప్రారంభించిన సంస్కరణశీలి పీవీ అన్నారు. ఆయనొక విద్యానిధి, సాహిత్య పెన్నిధని, పీవీ అనేక రచనలు చేశారన్నారు. సంస్కరణశీలురే […]

Update: 2021-06-28 01:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబద్ నెక్లెస్ రోడ్డులో 16 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళసైతో కలిసి సీఎం కేసీఆర్ అవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ పీపీ ఒక శిఖరమని కొనియాడారు. విగ్రహాన్ని చూస్తుంటే పీవీని చూసినట్టే ఉందన్నారు. అంతేకాకుండా నవోదయవంటి విద్యాసంస్థలను ప్రారంభించిన సంస్కరణశీలి పీవీ అన్నారు. ఆయనొక విద్యానిధి, సాహిత్య పెన్నిధని, పీవీ అనేక రచనలు చేశారన్నారు. సంస్కరణశీలురే అభ్యుదయ తరానికి బాటలు వేయగలరన్నారు. పీవీ చాలా పటిష్టంగా భూసంస్కరణలు చేశారని గుర్తు చేశారు. 800ల ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచిన ఘనత పీవీకే దక్కుతుందన్నారు. కాకతీయ యూనివర్సిటీలో పీవీ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పీవీ విద్యాపీఠం చాలా గొప్పగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో పీవీ గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలు నేటితో ముగుస్తున్నాయని, ఈ వేడుకలకు విజయవంతం చేసిన కమిటీ ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్.

పుస్తకాలు అవిష్కరించిన గవర్నర్

పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పీవీ నరసింహారావుపై రాసిన 8 పుస్తకాలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళసై.. పీవీ పేద ప్రజల పెన్నిధి అన్నారు. అంతేకాకుండా ఈ రోజు పండుగ రోజుని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కర్త అని పీవీని కొనియాడారు.

Tags:    

Similar News