ఫ్లాష్..ఫ్లాష్.. కత్తి మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం.. తేల్చిచెప్పిన డాక్టర్లు…

దిశ, ఏపీ బ్యూరో: చెన్నై-కలకత్తా రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు కత్తి మహేష్‌ పరిస్థితి విషమిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మహేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ తలకు తీవ్ర గాయాలవడంతో స్పెషల్ ఐసోలేషన్‌లో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మరికాసేపట్లో మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ […]

Update: 2021-06-26 04:22 GMT

దిశ, ఏపీ బ్యూరో: చెన్నై-కలకత్తా రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు కత్తి మహేష్‌ పరిస్థితి విషమిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మహేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ తలకు తీవ్ర గాయాలవడంతో స్పెషల్ ఐసోలేషన్‌లో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మరికాసేపట్లో మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో కత్తి మహేష్ బంధువులు, స్నేహితులు మెడికవర్ ఆస్పత్రికి తరలివచ్చారు.

 

Tags:    

Similar News