స్టన్నింగ్ లుక్‌లో ఆర్ఎక్స్ 100 హీరో

‘లాక్‌డౌన్ మనల్ని ఇంట్లో బంధించగలదేమో కానీ.. మన ప్రతిభను, కలలను నాలుగు గోడలకు పరిమితం చేయలేదు’ అని ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు చెప్పారు. కానీ, టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ విషయాన్ని నిజం చేసి చూపించారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఫుల్ వర్కవుట్ చేసిన ఈ ఆర్ఎక్స్ 100 హీరో… స్టన్నింగ్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ‘లాక్‌డౌన్ మన ప్రణాళికలను మార్చగలిగింది కానీ.. మన లక్ష్యాలను ప్రభావితం చేయలేకపోయింది’ అంటూ కిల్లర్ […]

Update: 2020-05-27 03:19 GMT

‘లాక్‌డౌన్ మనల్ని ఇంట్లో బంధించగలదేమో కానీ.. మన ప్రతిభను, కలలను నాలుగు గోడలకు పరిమితం చేయలేదు’ అని ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు చెప్పారు. కానీ, టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ విషయాన్ని నిజం చేసి చూపించారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఫుల్ వర్కవుట్ చేసిన ఈ ఆర్ఎక్స్ 100 హీరో… స్టన్నింగ్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ‘లాక్‌డౌన్ మన ప్రణాళికలను మార్చగలిగింది కానీ.. మన లక్ష్యాలను ప్రభావితం చేయలేకపోయింది’ అంటూ కిల్లర్ లుక్‌తో నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాడు. ఈ పిక్‌పై ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆహా అంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు ‘పాపం కార్తికేయపై మరోసారి ఇందు కన్ను పడింది.. ఇంకేముంది ఆర్ఎక్స్ 100 సీక్వెల్‌కు రెడీ అయిపోండి’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు.. ఈ పిక్ చూశారా లేదా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్ బర్త్‌డే రోజున తారక్ సిక్స్ ప్యాక్ పిక్ వైరల్ కాగా.. వర్మ దానిపై తనదైన రీతిలో స్పందించిన విషయం తెలిసిందే. మరి ఈ ఫొటోలో కార్తికేయ న్యూ లుక్ చూసి ఎలా స్పందిస్తాడో అని నెటిజన్లు వెయిట్ చేస్తున్నారు.

ఆర్‌ఎక్స్ 100 సినిమా తర్వాత ఆ స్థాయిలో మరో హిట్ అందుకోలేక పోయిన ఈ హీరో.. గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చివరగా 90ఎంఎల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కార్తికేయ.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరెకెక్కనున్న ‘చావు కబురు చల్లగా’ సినిమాతో రాబోతున్నాడు. మరి ఈ సినిమా అయినా కార్తికేయకు కమర్షియల్ హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమాలో బస్తీ బాలరాజుగా ఊర మాస్ గెటప్‌లో కనిపించనున్న కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి నటించనుంది.

Tags:    

Similar News