ఈటలతో కదిలిన కర్ర శ్రీనివాస్ రెడ్డి.. గెలుపే ధ్యేయంగా

దిశ,పాలకుర్తి : ఈటల రాజేందర్ ను గెలపించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని జనగామ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపును కోరుతూ పాలకుర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హుజురాబాద్ బయల్దేరినారు. ఈ సందర్భంగా కర్ర శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటినుండి రాష్ట్ర సాధన […]

Update: 2021-07-30 06:27 GMT

దిశ,పాలకుర్తి : ఈటల రాజేందర్ ను గెలపించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని జనగామ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపును కోరుతూ పాలకుర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హుజురాబాద్ బయల్దేరినారు.

ఈ సందర్భంగా కర్ర శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటినుండి రాష్ట్ర సాధన ధ్యేయంగా ఉద్యమంలో చురకైన పాత్ర పోషించిన రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించి టీఆర్ఎస్ కు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజేందర్ గెలుపే ధ్యేయంగా హుజురాబాద్ నియోజకవర్గంలో తమ వంతు బాధ్యతగా ప్రచారం నిర్వహించడం జరగుతుందని చెప్పారు. హుజురాబాద్ కు బయల్దేరిన వారిలో మండల అధ్యక్షులు కమ్మగాని శ్రీకాంత్,దొంగరి మహేందర్, దుంపల సంపత్,నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News