బాలసాని అనుచరుడికి యూత్ అధ్యక్ష పదవి..

దిశ, చర్ల: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడు కాకి అనిల్‌కి టీఆర్ఎస్ పార్టీ చర్ల మండల యువత అధ్యక్ష పదవి లభించింది. చర్ల మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులుగా కాకి అనిల్‌, కార్యదర్శిగా నెర్రబోయిన చంద్రశేఖర్‌లను నియమించినట్లు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావ్ ప్రకటించారు. తనకు ఈ పదవి రావడానికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ కార్యదర్శి […]

Update: 2021-09-27 04:54 GMT

దిశ, చర్ల: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడు కాకి అనిల్‌కి టీఆర్ఎస్ పార్టీ చర్ల మండల యువత అధ్యక్ష పదవి లభించింది. చర్ల మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులుగా కాకి అనిల్‌, కార్యదర్శిగా నెర్రబోయిన చంద్రశేఖర్‌లను నియమించినట్లు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావ్ ప్రకటించారు. తనకు ఈ పదవి రావడానికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, చర్ల పీఏసీఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్‌లకు కాకి అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో యువతకు భాగస్వామ్యం పెరిగేలా తనవంతు కృషి చేస్తానని, యువజన సంఘాన్ని పటిష్డం, బలోపేతం చేస్తానని కాకి అనిల్ తెలిపారు.

Tags:    

Similar News