జూరాల 11 గేట్లు ఎత్తివేత

దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో 80,700 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,02,795 క్యూసెక్కులుగా ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.93 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు. అలాగే రెండు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

Update: 2020-08-13 10:50 GMT

Tags:    

Similar News