సమ్మె విరమించిన జూడాలు

దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్​పీజీ కౌన్సిలింగ్​ నిర్వహించాలంటూ గత వారం రోజులుగా జూడాలు నిర్వహిస్తున్న సమ్మెను ఈ రోజు నుంచి విరమిస్తున్నట్లు జూడా ప్రెసిడెంట్​ డా సాగర్​ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెరుగుతున్న కొవిడ్​ కేసులు, ఒమిక్రాన్​ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రజల వైద్యసేవలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే నీట్​ పీజీ 2021 కౌన్సిలింగ్​ ప్రక్రియ వేగవంతం అయ్యేవరకు శాంతియుత నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని […]

Update: 2021-12-07 12:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్​పీజీ కౌన్సిలింగ్​ నిర్వహించాలంటూ గత వారం రోజులుగా జూడాలు నిర్వహిస్తున్న సమ్మెను ఈ రోజు నుంచి విరమిస్తున్నట్లు జూడా ప్రెసిడెంట్​ డా సాగర్​ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెరుగుతున్న కొవిడ్​ కేసులు, ఒమిక్రాన్​ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రజల వైద్యసేవలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే నీట్​ పీజీ 2021 కౌన్సిలింగ్​ ప్రక్రియ వేగవంతం అయ్యేవరకు శాంతియుత నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని చెప్పారు.

Tags:    

Similar News