హీరో రామ్‌చరణ్ బర్త్‌డే… రక్తదానం చేసిన డ్యాన్స్‌ మాస్టర్

దిశ, వెబ్ డెస్క్: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ సతీసమేతంగా హాజరయ్యారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు రామ్‌చరణ్ కారణమని అన్నారు. పలు సందర్భాల్లో తనకు రామ్‌చరణ్ అండగా నిలిచారని కొనియాడారు. రామ్‌చరణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు ఏర్పాటు చేసిన రక్తదాన […]

Update: 2021-03-27 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ సతీసమేతంగా హాజరయ్యారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు రామ్‌చరణ్ కారణమని అన్నారు. పలు సందర్భాల్లో తనకు రామ్‌చరణ్ అండగా నిలిచారని కొనియాడారు. రామ్‌చరణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తన సతీమణితో కలిసి జానీ మాస్టర్ రక్తదానం చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News