UPSC ఎన్డీఏ & ఎన్ఏ ఎగ్జామినేషన్ (2) - 2023

రక్షణ రంగంలో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతీ ఏడాది రెండు సార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది

Update: 2023-05-18 10:22 GMT

దిశ, కెరీర్: రక్షణ రంగంలో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతీ ఏడాది రెండు సార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. 2023 ఏడాదికిగాను రెండో విడత నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో ప్రవేశాలుంటాయి. జులై 2, 2024 నుంచి ప్రారంభమయ్యే 152వ కోర్సులోనూ, 114వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. వీటికి ఇంటర్ పాస్ అయిన అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జామ్: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (2) - 2023

మొత్తం ఖాళీలు: 395

ఖాళీల వివరాలు:

ఆర్మీ - 208

నేవీ -42

ఎయిర్‌ఫోర్స్ - 120

నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)- 25

అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు - ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు: అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జనవరి 2, 2005కి ముందు, జనవరి 1, 2008 కి తర్వాత పుట్టి ఉండరాదు.

దరఖాస్తు: దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి.

ఎంపిక: రెండు దశల్లో ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష, ఇంటెలిజెన్స్ - పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.

కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక చేస్తారు.

బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ఎంచుకున్న కోర్చు ఉచితంగా చదవచ్చు.

శిక్షణ: అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువుతోపాటు శిక్షణ పొందుతారు.

ఎంపికైన విభాగాన్ని బట్టి శిక్షణ ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు ఉంటుంది.

కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

వీరికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరీర్ ప్రారంభం అవుతుంది.

దరఖాస్తు: రూ .100 ఉంటుంది. (ఎస్సీ,ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)

చివరి తేదీ: జూన్ 6, 2023.

ఆన్‌లైన్ రాతపరీక్ష: సెప్టెంబర్ 3, 2023.

కోర్సులు ప్రారంభం: జులై 2, 2024

ఏపీ, టీఎస్‌లలో పరీక్షా కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.

వెబ్‌సైట్: https://upsconline.nic.in

Tags:    

Similar News