ఎయిర్ ఇండియాలో 145 ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ ఉద్యోగాలు

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ (ఎఐఎఎస్ఎల్) .. హ్యాండిమ్యాన్, జూనియర్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తో పాటు ఇతర ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది

Update: 2023-03-28 13:09 GMT

దిశ, కెరీర్: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ (ఎఐఎఎస్ఎల్) .. హ్యాండిమ్యాన్, జూనియర్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తో పాటు ఇతర ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు : 145

ఖాళీల వివరాలు- వయసు:

డ్యూటీ ఆఫీసర్ - 1 (గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లు)

జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్ -4 (గరిష్ట వయసు 28 ఏళ్లు)

జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ - 2 (గరిష్ట వయసు 35 ఏళ్లు)

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 16 (గరిష్ట వయసు 28 ఏళ్లు)

యుటిలిటీ ఏజెంట్ అండ్ ర్యాంప్ డ్రైవర్ - 6 (గరిష్ఠ వయసు 28 ఏళ్లు)

హ్యాండీ మ్యాన్ - 98 (గరిష్ట వయసు 28 ఏళ్లు)

అర్హత: అభ్యర్థులు 10+2, ఐటీఐ, డిప్లొమా(సంబంధిత సబ్జెక్టు), ఎంబీఏ ఉత్తీర్ణత.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 3 నుంచి 7 వరకు/ 2023.

వెబ్‌సైట్: http://www.aiasl.in

Tags:    

Similar News