20 వేలకు పైగా పెరిగిన SSC ఖాళీలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/రైఫిల్ మ్యాన్/సిపాయి పోస్టుల నోటిఫికేషన్‌లో ఉద్యోగ ఖాళీల సంఖ్యలో మార్పులు చేసింది.

Update: 2022-11-28 16:47 GMT

దిశ, కెరీర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/రైఫిల్ మ్యాన్/సిపాయి పోస్టుల నోటిఫికేషన్‌లో ఉద్యోగ ఖాళీల సంఖ్యలో మార్పులు చేసింది. నియామక ప్రకటన విడుదల సమయంలో మొత్తం 24,369 ఖాళీలు ప్రకటించగా .. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్యను 45,284కు పెంచుతూ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటనలో అదనంగా 20,915 పోస్టులు చేరాయి.

ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ); నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎస్ఎస్‌బీ)లో సిపాయి పోస్టులు భర్తీకి ఎస్ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించనుంది.

READ MORE

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT-2023) 

Tags:    

Similar News