లక్ష రూపాయల జీతంతో నైవలీ లిగ్నైట్‌లో ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే!
నైవేలీ లోని ప్రభుత్వ రంగ సంస్థ.. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్) జూనియర్ ఓవర్‌మ్యాన్, సర్వేయర్, సిర్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: నైవేలీ లోని ప్రభుత్వ రంగ సంస్థ.. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్) జూనియర్ ఓవర్‌మ్యాన్, సర్వేయర్, సిర్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 213
పోస్టుల వివరాలు:
జూనియర్ ఓవర్‌మ్యాన్ (ట్రైనీ) - 51
జూనియర్ సర్వేయర్ (ట్రైనీ) - 15
సిర్దార్ (సెలక్షన్ గ్రేడ్ - 1): 147
అర్హత: పోస్టులను అనుసరించి డిప్లొమా (మైనింగ్/మైనింగ్ ఇంజనీరింగ్/మైన్ సర్వేయింగ్)/డిగ్రీ (సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఓవర్ మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: నవంబర్ 1, 2022 నాటికి 30 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు జేవో, జేఎన్ పోస్టులకు రూ. 31,000 నుంచి రూ. 1,00,000, సిర్దార్ లకు రూ. 26,000 నుంచి రూ. 1,10,000 ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా..
చివరి తేదీ: డిసెంబర్ 30, 2022.
వెబ్సైట్: https://www.nlcindia.in