తెలంగాణలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు
తెలంగాణ ఔషద నియంత్రణ పరిపాలన విభాగంలో 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, కెరీర్: తెలంగాణ ఔషద నియంత్రణ పరిపాలన విభాగంలో 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16 నుంచి జనవరి 5 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు - 18
అర్హతలు: డిగ్రీ (ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్స్), ఫార్మా డీ లేదా మెడిసిన్ (క్లినికల్ ఫార్మకాలజీ/ మైక్రోబయాలజీ స్పెషలైజేషన్ ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 1/7/2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 51,320 నుంచి 1,27,310 ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్షల, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 16,2022.
చివరి తేదీ: జనవరి 5, 2022.
వెబ్సైట్: https://websitenew.tspsc.gov.in