విజయనగరం జిల్లాలో 60 అంగన్వాడీ ఖాళీలు
విజయనగరం జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం.. విజయనగరం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దిశ, కెరీర్: విజయనగరం జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం.. విజయనగరం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
అంగన్వాడీ వర్కర్ : 10
అంగన్వాడీ హెల్పర్: 44
మినీ అంగన్వాడీ వర్కర్: 6
మొత్తం ఖాళీల సంఖ్య: 60
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు అంగన్వాడీ వర్కర్‌కు రూ. 11,500; అంగన్వాడీ హెల్పర్ /మినీ అంగన్వాడీ వర్కర్ కు రూ. 7,000.
ఎంపిక: పదోతరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2023.
వెబ్సైట్: https://vizianagaram.ap.gov.in