ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో 1,793 ట్రేడ్స్ మ్యాన్, ఫైర్ మ్యాన్ పోస్టులు
సికింద్రాబాద్లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్ మ్యాన్ మేట్, ఫైర్ మ్యాన్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: సికింద్రాబాద్లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్ మ్యాన్ మేట్, ఫైర్ మ్యాన్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
ట్రేడ్స్ మ్యాన్ మేట్ - 1249
ఫైర్ మ్యాన్ - 544
మొత్తం పోస్టులు: 1,793
రీజియన్లు: ఈస్ట్రన్, వెస్ట్రన్, నార్తర్న్, సదరన్, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్ రీజియన్.
అర్హతలు: ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు మెట్రిక్యులేషన్, ఐటీఐ.
ఫైర్ మ్యాన్ ఖాళీలకు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ట్రేడ్స్ మ్యాన్ పోస్టులకు రూ. 18,000 నుంచి రూ. 56,900;
ఫైర్ మ్యాన్ ఖాళీలకు రూ. 19,900 నుంచి రూ. 63,200 ఉంటుంది.
ఎంపిక: ఫిజికల్ ఎండ్యూరెన్స్ /స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా..
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
వెబ్సైట్: https://www.aocrecruitment.gov.in