ఈనెల 13న నల్గోండలో జాబ్‌ మేళా..

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్ లో ఈనెల 13న  రూరల్ ఎడ్యుకేషనల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ (రీడ్స్) – టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్),  ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి సంయుక్త సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు  ఏసీటీ హెచ్ఆర్ సందీప్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 13న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా […]

Update: 2021-12-09 08:03 GMT

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్ లో ఈనెల 13న రూరల్ ఎడ్యుకేషనల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ (రీడ్స్) – టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్), ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి సంయుక్త సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏసీటీ హెచ్ఆర్ సందీప్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

13న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన వారు అర్హులని చెప్పారు. మొత్తం 300 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు 6301423438, 6301409866, 6304925849 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Tags:    

Similar News