ఆర్థిక ఉద్దీపన చారిత్రాత్మక సంస్కరణ : పవన్ కల్యాణ్

దిశ, ఏపీబ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చారిత్రాత్మక సంస్కరణ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ మరోదశ పెంపు లేదా కుదింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానికి పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెబుతూ, మీరు అభిలషిస్తున్న ‘స్వయం ఆధారిత భారత్’ దేశానికి ఎంతో మేలు చేస్తుంది. దేశాభివృద్ధితో పాటు ప్రపంచానికి దిక్సూచిలా వ్యవహరించేందుకు […]

Update: 2020-05-13 03:06 GMT

దిశ, ఏపీబ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చారిత్రాత్మక సంస్కరణ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ మరోదశ పెంపు లేదా కుదింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానికి పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెబుతూ, మీరు అభిలషిస్తున్న ‘స్వయం ఆధారిత భారత్’ దేశానికి ఎంతో మేలు చేస్తుంది. దేశాభివృద్ధితో పాటు ప్రపంచానికి దిక్సూచిలా వ్యవహరించేందుకు తోడ్పాటునందిస్తుంది. మీరు ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ఓ చారిత్రాత్మక సంస్కరణ అవుతుంది. అది ఇవాళ్టి నుంచే ప్రారంభం కావాలి. 21వ శతాబ్దం భారత్ దే. ఇది నవ భారత్ ఆవిర్భావానికి నాంది” అంటూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News