ఎమ్మెల్యే తిట్ల పురాణం.. జనసేన కార్యకర్త సూసైడ్

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే తనను దూషించాడని మనస్తాపం చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. రెండ్రోజుల కోనపల్లిలో కింద పారిశుధ్య సమస్యలపై గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబును బండ్ల వెంగయ్యనాయుడు నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రాంబాబు అందరి ఎదుట అతనితో తీవ్ర పదజాలంతో దుర్భాశలాడాడు. దీంతో మనస్తాపం చెందిన […]

Update: 2021-01-18 03:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే తనను దూషించాడని మనస్తాపం చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. రెండ్రోజుల కోనపల్లిలో కింద పారిశుధ్య సమస్యలపై గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబును బండ్ల వెంగయ్యనాయుడు నిలదీశాడు.

దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రాంబాబు అందరి ఎదుట అతనితో తీవ్ర పదజాలంతో దుర్భాశలాడాడు. దీంతో మనస్తాపం చెందిన వెంగయ్యనాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News