‘బీబీఎల్’ విన్నర్ సిడ్నీ సిక్సర్స్

సిడ్నీ: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్‌పై సిడ్నీ సిక్సర్స్ జట్టు 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ జట్టు, జె విన్స్(95; 10×4, 3×6) మెరుపు బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్‌మెన్‌లలో లియమ్ లివింగ్‌స్టోన్(45), […]

Update: 2021-02-06 13:27 GMT

సిడ్నీ: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్‌పై సిడ్నీ సిక్సర్స్ జట్టు 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ జట్టు, జె విన్స్(95; 10×4, 3×6) మెరుపు బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్‌మెన్‌లలో లియమ్ లివింగ్‌స్టోన్(45), కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్(30) మినహా ఎవరూ రాణించలేదు. బెన్ డ్వార్షియిస్(3/37), జాక్సన్ బర్డ్ బౌలింగ్ ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 161 పరుగులే చేయగలిగింది. ఫలితంగా సిడ్నీ సిక్సర్స్ జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించి, బీబీఎల్ ట్రోఫీని అందుకుంది.

Tags:    

Similar News