పెన్మత్స కొడుకుకి జగన్ ఆఫర్ 

దిశ, వెబ్ డెస్క్: దివంగత సీనియర్ నేత, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కుమారుడు డా. పెన్మత్స సూర్యనారాయణరాజు (డా. సురేష్ బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ సీటుకు ఉపఎన్నిక జరగనుంది. కాగా ఈ స్థానానికి సురేష్ బాబును ఖరారు చేశారు జగన్. ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి […]

Update: 2020-08-11 09:35 GMT

దిశ, వెబ్ డెస్క్: దివంగత సీనియర్ నేత, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కుమారుడు డా. పెన్మత్స సూర్యనారాయణరాజు (డా. సురేష్ బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ సీటుకు ఉపఎన్నిక జరగనుంది.

కాగా ఈ స్థానానికి సురేష్ బాబును ఖరారు చేశారు జగన్. ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఆగష్టు 13 నామినేషన్ కు చివరి తేదీ. 24 న పోలింగ్ డేట్. ఆరోజు సాయంత్రమే ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.

Tags:    

Similar News