ఓటమి బాధలో ఉన్న కలకత్తా ప్లేయర్లకు షారుఖ్ ఖాన్ మోటివేషన్ స్పీచ్

Shah Rukh Khan gives a motivational speech to Calcutta players who are suffering from defeat

Update: 2024-04-17 09:32 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా మంగళవారం కలకత్తా, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 223 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో అంతా ఆ జట్టు విజయం తథ్యం అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాజస్థాన్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చివరి వరకు ఉండి విరోచిత సెంచరీతో రాజస్థాన్ జట్టుని గెలిపించాడు. దీంతో భారీ స్కోర్ కొట్టినప్పటికీ ఓటమిపాలైన కలకత్తా ప్లేయర్లు తీవ్ర నిరాశ లోకి వెళ్లారు. దీంతో ఆ జట్టు సహ-యజమాని అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ డ్రెస్సింగ్ రూమ్ లో వారితో ముచ్చటించారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో లో షారుఖ్.. "మన జీవితంలో, ముఖ్యంగా క్రీడల్లో కొన్ని సందర్భాల్లో మనం ఓడిపోతామని అనుకోనప్పటికి అనూహ్య ఫలితాలు వస్తాయి.. అలాగే కొన్ని సార్లు గెలవలేమనుకున్న సమయంలో విజయం వరిస్తుంది. ఈ ఐపీఎల్ అంటేనే అనేక మలుపులకు నిలయం.. నేటి మ్యాచ్‌లో మన ప్లేయర్లు చివరి వరకు పోరాడారు. కానీ విజయం వారిని వరించింది. దీని గురించి చింతించాల్సిన పనిలేదని.. షారుఖ్ ఖాన్ చెప్పుకొచ్చారు.


Similar News