IPL Fixing : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సైందా.. ఇది చూస్తే అలానే..

ఐపీఎల్-2023 సీజన్‌ చెరమాంకానికి చేరుకుంది. జరిగిన ప్రతి మ్యాచ్ ఆఖరి ఓవర్, ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగడం, ట్విస్టులు, ఊహించని మలుపులతో ఈ సీజన్ క్రీడాభిమానులకు తీపి గుర్తులను మిగిల్చింది.

Update: 2023-05-29 04:21 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్-2023 సీజన్‌ చెరమాంకానికి చేరుకుంది. జరిగిన ప్రతి మ్యాచ్ ఆఖరి ఓవర్, ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగడం, ట్విస్టులు, ఊహించని మలుపులతో ఈ సీజన్ క్రీడాభిమానులకు తీపి గుర్తులను మిగిల్చింది. నాటకీయ పరిణామాల నడుమ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుకున్నాయి. అయితేచ, ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన ఓ టెక్నికల్ తప్పిదం.. ఫైనల్ ఫిక్స్ అయ్యిందా అనే అనుమానాలు రేకెత్తించింది. ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్‌లో వర్షం కురిసింది.

దీంతో టాస్ వేసేందుకు ఆలస్యమైంది. ఆ విషయాన్ని ప్రదర్శించాల్సిన స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్ మీద రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ అని పడింది. జరిగింది టెక్నికల్ తప్పిదమే కానీ, చెన్నై సూపర్ కింగ్స్‌ రన్నరప్ అవుతోందని ముందే ఎలా ఊహించారు. అయినా, మ్యాచ్ ప్రారంభానికి ముందే చెన్నై ఓడిపోబోతోందని ఎలా అంచనా వేసి ప్రెసెంటేషన్ రెడీ చేసి పెట్టుకున్నారనే అనుమానాలు సగటు క్రీడాభిమానిలో రేకెత్తుతున్న కొత్త ప్రశ్నలు.

అసలు ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్ స్క్రిప్టు ప్రకారం నడుస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్-2023 సీజన్‌కి ఇలా ఫైనల్‌లో అనుకోని తప్పిదం, ఫిక్సింగ్ ఆరోపణలకు మరింత ఊతం కలిగించింది. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై సజావుగా జరిగి గుజరాత్ టైటాన్స్ గెలిస్తే ఈ ఫిక్సింగ్ ఆరోపణలు మరింత పెరుగుతాయి. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ బాగా ఆడి గెలిచినా.. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవాలని ముందుగానే ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఫిక్స్ చేసిందనే వాదనలు మరింత బలపడతాయి. 

Read more:

2023 IPL final: ఇవాళ కూడా వర్షం పడితే విన్నర్‌ను డిసైడ్‌ చేసేది ఇలాగే!

Tags:    

Similar News