IPL క్వాలిఫయర్-2: టాస్ గెలిచిన రాజస్థాన్.. సేమ్ టీమ్‌లతో బరిలోకి ఇరు జట్లు

ఐపీఎల్ 2024 సీజన్ చివరి స్టేజ్‌కు చేరుకుంది. ఈ ఏడాది టైటిల్ విజేత ఎవరూ తేలేందుకు మరో రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి.

Update: 2024-05-24 13:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ చివరి స్టేజ్‌కు చేరుకుంది. ఈ ఏడాది టైటిల్ విజేత ఎవరూ తేలేందుకు మరో రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే లీగ్ మ్యాచులు, క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి. ఇవాళ (శుక్రవారం) క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచింది. దీంతో ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకుని హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ కోసం ఫస్ట్ ఫైనలిస్ట్ కోల్‌కతాతో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరూ గెలుస్తారని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ చివరి మ్యాచులో ఓటమితో ఎస్‌ఆర్‌హెచ్ ఒత్తిడిలో ఉండగా.. ఆర్సీబీపై విజయంతో ఆర్ఆర్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. 

జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(c), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, T నటరాజన్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Similar News