IPL 2023: లక్నోపై గుజరాత్ ఘన విజయం..

IPL 2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Update: 2023-05-07 14:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో 171 పరుగులకే పరిమితమైంది. లక్నో నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 171 రన్స్ మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్స్‌లో డికాక్ (70), మేయర్స్ (48) రన్స్‌తో రాణించారు. గుజరాత్ బౌలర్‌లో.. మోహిత్ శర్మ 4 వికెట్లు తీయగా.. షమీ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ టైటాన్స్ ఓపెనర్స్ చెలరేగి ఆడగా.. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 227 భారీ స్కోరు చేసింది. గుజరాత్ బ్యాటర్స్‌లో.. గిల్ (94 నాటౌట్), సాహా (81) పరుగులతో రాణించారు. లక్నో బౌలర్‌లో మొహ్సిన్ ఖాన్, అవేశ్ ఖాన్ 1 వికెట్ తీశారు.

Tags:    

Similar News