హుజురాబాద్ ఎన్నికలో పోటీచేయాలనుకున్న నిరుద్యోగులకు ఆహ్వానం

దిశ, డైనమిక్ బ్యూరో:  సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ బై ఎలక్షన్ లో పోటీ చేసేందుకు ఆసక్తి గల నిరుద్యోగులను వైఎస్ఆర్టీపీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు (నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, యువకులు, ఇతరులు) హుజురాబాద్ ఉప ఎన్నికల కోఆర్డినేటర్ బొమ్మ భాస్కర్ రెడ్డిని సంప్రదించాలని పార్టీ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా.. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతోందని, అందువల్ల ఉప ఎన్నికలో పోటీ […]

Update: 2021-09-28 03:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ బై ఎలక్షన్ లో పోటీ చేసేందుకు ఆసక్తి గల నిరుద్యోగులను వైఎస్ఆర్టీపీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు (నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, యువకులు, ఇతరులు) హుజురాబాద్ ఉప ఎన్నికల కోఆర్డినేటర్ బొమ్మ భాస్కర్ రెడ్డిని సంప్రదించాలని పార్టీ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా.. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతోందని, అందువల్ల ఉప ఎన్నికలో పోటీ చేసి, సర్కారు తీరును దేశ వ్యాప్తంగా ఎండగట్టాలని వైఎస్ఆర్టీపీ నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో నామినేషన్ వేసేందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News