అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోవల్సిందిగా గిరిజన సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 15లోగా అర్హతగల ఎస్టీ విద్యార్థులు https://telanaganaepass.cgg.gov.in వైబ్ సైట్ ద్వారా సంబంధిత డాక్యూమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలి సూచించారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ప్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో పీజి కోర్స్ చదవాలనుకున్న విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా […]

Update: 2021-05-22 09:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోవల్సిందిగా గిరిజన సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 15లోగా అర్హతగల ఎస్టీ విద్యార్థులు https://telanaganaepass.cgg.gov.in వైబ్ సైట్ ద్వారా సంబంధిత డాక్యూమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలి సూచించారు.

అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ప్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో పీజి కోర్స్ చదవాలనుకున్న విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా రూ.20లక్షల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించనుందని వివరించారు. వీసా ఫీ, విమాన ప్రయాణ చార్జీలు కూడా ఈ పథకం ద్వారా ఇవ్వబడుతాయని తెలిపారు. 2021 జులై 21 నాటికి 35 సంవత్సరాలు మించరాదని విద్యార్థి కుటుబ ఆధాయం సంవత్సరానికి రూ.5లక్షల లోపు ఉండాలని నిబంధనలు విధించారు.

Tags:    

Similar News