ఎన్. శంకర్‌కు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్‌ ఎన్. శంకర్‌కు హైదరాబాద్ శివారులో ప్రభుత్వం భూమి కేటాయింపులు జరపడంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. రూ.2.5కోట్ల భూమిని కేవలం రూ.25లక్షలకే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్.శంకర్ కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలపగా… రాష్ట్రం కోసం వేలమంది త్యాగం చేశారని, అందరికీ ఇలాగే ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో అద్భుతమైన రామోజీఫిల్మ్‌ సిటీ ఉందని, ఒకవేళ స్టూడియో నిర్మించాలనుకుంటే […]

Update: 2020-08-27 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్‌ ఎన్. శంకర్‌కు హైదరాబాద్ శివారులో ప్రభుత్వం భూమి కేటాయింపులు జరపడంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. రూ.2.5కోట్ల భూమిని కేవలం రూ.25లక్షలకే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్.శంకర్ కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలపగా… రాష్ట్రం కోసం వేలమంది త్యాగం చేశారని, అందరికీ ఇలాగే ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.

ఇప్పటికే హైదరాబాద్‌లో అద్భుతమైన రామోజీఫిల్మ్‌ సిటీ ఉందని, ఒకవేళ స్టూడియో నిర్మించాలనుకుంటే ప్రభుత్వమే నిర్మించొచ్చు కదా అని అభిప్రాయపడింది. ప్రభుత్వ భూములను సినీపరిశ్రమ ఆక్రమించడానికి వీలు లేదన్న హైకోర్టు.. ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇవ్వొద్దని సూచన చేసింది. కేబినెట్ నిర్ణయాలు సహేతుకంగా ఉండాలని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News