ట్రాఫిక్ రూల్స్‌పై వినూత్న ప్రచారం

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి చేస్తోన్న వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. కేపీహెచ్‌బీలో నివాసముండే నూకాజీ, తన సోదరుడు 2019లో హెల్మెట్ ధరించకుండా.. రాంగ్ రూట్‌లో రావడంతో యాక్సిడెంట్‌కి గురై చనిపోయారని, అప్పటినుంచి 2019 నుంచి అందరూ నిబంధనలు పాటించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. నూకాజీ మాట్లాడుతూ.. రోజూ ఉదయం 6 గంటల నుంచి […]

Update: 2021-10-02 07:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి చేస్తోన్న వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. కేపీహెచ్‌బీలో నివాసముండే నూకాజీ, తన సోదరుడు 2019లో హెల్మెట్ ధరించకుండా.. రాంగ్ రూట్‌లో రావడంతో యాక్సిడెంట్‌కి గురై చనిపోయారని, అప్పటినుంచి 2019 నుంచి అందరూ నిబంధనలు పాటించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. నూకాజీ మాట్లాడుతూ.. రోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ జేఎన్టీయూ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తానన్నారు. రోడ్డు దాటేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదని, ద్విచక్ర వాహనం నడిపేవారితో పాటు వెనకాల కూర్చున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ వివిధ అవతారాల్లో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

Tags:    

Similar News