అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగింపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల సేవలపై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. జులై 31 దాకా ఈ విమానాలపై నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఓ సర్క్యూలర్‌లో ప్రకటించింది. అన్నిరకాల కార్గో విమానాలకు దీని నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, ఎంపిక చేసిన మార్గాల్లో డీసీజీఏ ఆదేశాలకు అనుగుణంగా విమాన సేవలు కొనసాగవచ్చునని వివరించింది. గతేడాది మార్చి నెలలో తొలిసారిగా అంతర్జాతీయ విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అప్పటి నుంచి ఈ నిషేధాన్ని పలుసార్లు పొడిగించింది. […]

Update: 2021-06-30 05:03 GMT

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల సేవలపై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. జులై 31 దాకా ఈ విమానాలపై నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఓ సర్క్యూలర్‌లో ప్రకటించింది. అన్నిరకాల కార్గో విమానాలకు దీని నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, ఎంపిక చేసిన మార్గాల్లో డీసీజీఏ ఆదేశాలకు అనుగుణంగా విమాన సేవలు కొనసాగవచ్చునని వివరించింది. గతేడాది మార్చి నెలలో తొలిసారిగా అంతర్జాతీయ విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అప్పటి నుంచి ఈ నిషేధాన్ని పలుసార్లు పొడిగించింది. కాగా, దేశీయ విమాన సేవలను మే నెల నుంచి పునరుద్ధరించింది. ఇప్పటికీ కొన్ని దేశాలతో ఎయిర్‌బబుల్ ఒప్పందం కింద విమాన సేవలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News