ఆదాయపు పన్ను రిటర్నులకు డెడ్‌లైన్..

దిశ, వెబ్‌డెస్క్ : ఈ ఏడాది కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం రెండుసార్లు ఐటీ రిటర్నుల దాఖలుకు గడువును పొడిగించింది. ఈ క్రమంలో ఈ నెల 21 నాటికి దేశంలోని 3.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేశారని, మిగిలిన వారు కూడా తమ రిటర్నులను ఈ నెల 31తో ముగిసే చివరి తేదీ నాటికి దాఖలు చేయాలని ఆదాయ పన్ను పన్ను శాఖ మంగళవారం పన్ను చెల్లింపుదారులకు గుర్తుచేసింది. […]

Update: 2020-12-22 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ ఏడాది కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం రెండుసార్లు ఐటీ రిటర్నుల దాఖలుకు గడువును పొడిగించింది. ఈ క్రమంలో ఈ నెల 21 నాటికి దేశంలోని 3.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేశారని, మిగిలిన వారు కూడా తమ రిటర్నులను ఈ నెల 31తో ముగిసే చివరి తేదీ నాటికి దాఖలు చేయాలని ఆదాయ పన్ను పన్ను శాఖ మంగళవారం పన్ను చెల్లింపుదారులకు గుర్తుచేసింది.

‘ 2020-21 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఇప్పటికే 3.75 కోట్ల మంది ఐటీ రిటర్నులను దాఖలు చేసిన తరుణంలో మిగిలినవారు కూడా చేయమని’ ట్విటర్ వేదిక ద్వారా కోరింది. ఈ ఏడాదిలో కరోనాను నియంత్రించేందుకు కేంద్రం పలు చర్యలను ప్రకటించింది. అందులో భాగంగానే 2019-20 ఆర్థిక సంవత్సరం(2020-21 అసెస్‌మెంట్ ఇయర్)కి పన్ను రిటర్న్ దాఖలు గడువును డిసెంబర్ 31కి పొడిగించింది. పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, అకౌంట్‌లను ఆడిట్ చేయవలసిన పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్ ఫైలింగ్ తేదీని వచ్చే ఏడాది జనవరి 31కి పొడిగించింది.

Tags:    

Similar News