డంప్ యార్డులో పడేసి.. దారుణ హత్య

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైత్లాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామకృష్ణ అనే యువకుడ్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్యచేసి డంపింగ్ యార్డులో పడేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మియాపూర్‌లో ట్రావెల్స్ నిర్వహిస్తున్న రామకృష్ణగా గుర్తించారు. గురువారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లాడని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు […]

Update: 2021-01-08 08:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైత్లాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామకృష్ణ అనే యువకుడ్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్యచేసి డంపింగ్ యార్డులో పడేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మియాపూర్‌లో ట్రావెల్స్ నిర్వహిస్తున్న రామకృష్ణగా గుర్తించారు. గురువారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లాడని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News