పండుగ వేళ.. సంప్రదాయ వస్త్రాధారణ‌తో మెరిసిన విద్యార్థులు

దిశ, పటాన్ చెరు: కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఇరవై సాంకేతికతలు వ్యాపార విధులను ప్రభావితం చేస్తాయని, అవన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అకౌంటింగ్ వృత్తిని, వ్యాపారంలో అకౌంటింగ్ పనితీరును సమూలంగా మార్చివేస్తాయని ఏసీసీఏ భారతీయ అధిపతి గౌరవ్ కపూర్ అన్నారు. గీతం హైదరాబాద్ బిజెనెస్ స్కూల్ (జీహెచ్ బీఎస్) లో అకౌంటింగ్ ఆధునిక పోకడలు అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృత్రిమ మేథ, అటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, అకౌంటింగ్ […]

Update: 2021-11-04 06:24 GMT

దిశ, పటాన్ చెరు: కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఇరవై సాంకేతికతలు వ్యాపార విధులను ప్రభావితం చేస్తాయని, అవన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అకౌంటింగ్ వృత్తిని, వ్యాపారంలో అకౌంటింగ్ పనితీరును సమూలంగా మార్చివేస్తాయని ఏసీసీఏ భారతీయ అధిపతి గౌరవ్ కపూర్ అన్నారు. గీతం హైదరాబాద్ బిజెనెస్ స్కూల్ (జీహెచ్ బీఎస్) లో అకౌంటింగ్ ఆధునిక పోకడలు అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృత్రిమ మేథ, అటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, అకౌంటింగ్ అనలిటిక్స్, బిగ్ డేటా ఆవశ్యకతల గురించి చెబుతూ.. అవి వర్తమాన వ్యాపారంలో కీలక భూమిక పోషించనున్నాయన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికలను అనుసంధానించడానికి మరికొంత సమయం పడుతుందన్నారు.

కరీంనగర్‌లోని ఇండియన్ బ్యాంక్ జోనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ ఆశిష్ గుల్జార్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్ పరిశ్రమతో సహా ప్రస్తుత వ్యాపార వాతావరణంలో ఈ కొత్త టెక్నాలజీ వినియోగాన్ని నొక్కిచెప్పారు. బ్యాంకింగ్ పరిశ్రమకు ఆటోమేషన్, కృత్రిమ మేధ అవసరనున్నారు. ఈ నూతన సాంకేతికతల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని. దీనిపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాల్సిన ఆవసరం ఎంతైనా ఉందని గీతం ప్రోవీసీ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, మేనేజ్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ కె.గౌతవులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ బీఎస్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్, వెజాగ్ స్టీల్ ప్లాంట్ మాజీ డెరైక్టర్ (ఫైనాన్స్) టీవీ కృష్ణకుమార్, టాటా స్టీల్ ఏజీఎం అనిల్ కుమార్ పాటి, ఫ్యాక్డ్ ఫైనాన్స్ డెరెక్టర్ శక్తిమతి ఐసీఎంఏ దక్షిణ ప్రాంత మండలి చైర్మన్ ఎస్.పాపారావు తదితరులు పాల్గొన్నారు. సదస్సు సమన్వయకర్త గుత్తి ఆర్కే ప్రసాద్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

సంప్రదాయ వస్త్రాధారణ దినోత్సవం

కొవిడ్ 19 నేపథ్యంలో తొలి కార్యక్రమంగా, గీతం ఎంబీఏ చివరి ఏడాది విద్యార్థులు సంప్రదాయ వస్త్రాధారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యాంతం ఉత్సాహభరితంగా సాగడంతో పాటు ఓ చిరస్మరణీయమైన వేడుకగా నిలిచిపోయింది. ఇది భారతీయ సంప్రదాయాన్ని, దాని వైవిధ్యాన్ని చాటి చెప్పిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News