‘అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు’

  దిశ, మెదక్: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడిని నిర్బంధాలతో అడ్డుకోవాలని కుట్రపన్నడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. పోలీసుల నిర్బంధాలను ఛేదించుకుని హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ చేరుకుని ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్‌లను అమలుచేయాలని కోరారు. అరెస్టు చేసిన ఉపాధ్యాయులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ […]

Update: 2020-03-13 02:06 GMT

 

దిశ, మెదక్: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడిని నిర్బంధాలతో అడ్డుకోవాలని కుట్రపన్నడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. పోలీసుల నిర్బంధాలను ఛేదించుకుని హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ చేరుకుని ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్‌లను అమలుచేయాలని కోరారు. అరెస్టు చేసిన ఉపాధ్యాయులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు తిరుపతిరెడ్డితో పాటు దౌల్తాబాద్ మండల అధ్యక్షులు సలీమ్ ఉద్దీన్, యూటీఎఫ్ బాధ్యులు నగేష్, నిరంజన్‌లను అరెస్ట్ చేశారు.

tags: illegal arrests, teachers, prc, kcr, telangana, tptf, thirupathi reddy, utf, pensioners, indira park,

Tags:    

Similar News