ఆదిలాబాద్ కలెక్టర్ కు మద్దతుగా ఐఏఎస్ అసోసియేషన్.. చర్యతీసుకోవాలంటూ..

దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశ్ రావ్ పై ఐఏఎస్ అసోసియేషన్ సీరియస్ అయింది. టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ పై అసభ్య కరమైన పదజాలం వాడుతూ ధూషించాడు. దాంతో రంగంలోకి దిగిన అసోసియేషన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ మాటలు కలెక్టర్ వృత్తిని అవమానించడమే కాదు, ఒక మహిళా అధికారి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఇలాంటి మాటలు మాను కోవాలని అసోసియేషన్ […]

Update: 2021-12-12 09:38 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశ్ రావ్ పై ఐఏఎస్ అసోసియేషన్ సీరియస్ అయింది. టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ పై అసభ్య కరమైన పదజాలం వాడుతూ ధూషించాడు. దాంతో రంగంలోకి దిగిన అసోసియేషన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ మాటలు కలెక్టర్ వృత్తిని అవమానించడమే కాదు, ఒక మహిళా అధికారి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఇలాంటి మాటలు మాను కోవాలని అసోసియేషన్ హితవు పలికింది.

రాజకీయ నాయకుడు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోని అందరి అధికారులను కించపరిచేవిగా భావిస్తున్నామన్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి కంప్లైంట్ చేసినట్టు ఒక ప్రకటన విడుదల చేశారు.

 

Tags:    

Similar News