బీసీబీపై మండిపడ్డ షకీబుల్ హసన్

దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ)పై ఆ దేశ క్రికెటర్ షకీబుల్ హసన్ తీవ్రంగా మండిపడ్డాడు. ఐపీఎల్‌లో ఆడాలన్న తన నిర్ణయాన్ని బీసీసీఐ తప్పుగా అర్దం చేసుకుందని షకీబ్ చెప్పాడు. ఐపీఎల్ జరిగే సమయంలోనే బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనున్నది. అయితే తాను టెస్టు మ్యాచ్‌లు ఆడనని.. ఐపీఎల్ ఆడతానని బీసీబీకి తేల్చి చెప్పాడు. దీంతో బీసీబీ ఇకపై బంగ్లా ఆటగాళ్ల కాంట్రాక్టు సమయంలోనే వేరే లీగ్స్ ఆడకుండా నిరోధించేలా […]

Update: 2021-03-21 09:10 GMT

దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ)పై ఆ దేశ క్రికెటర్ షకీబుల్ హసన్ తీవ్రంగా మండిపడ్డాడు. ఐపీఎల్‌లో ఆడాలన్న తన నిర్ణయాన్ని బీసీసీఐ తప్పుగా అర్దం చేసుకుందని షకీబ్ చెప్పాడు. ఐపీఎల్ జరిగే సమయంలోనే బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనున్నది. అయితే తాను టెస్టు మ్యాచ్‌లు ఆడనని.. ఐపీఎల్ ఆడతానని బీసీబీకి తేల్చి చెప్పాడు. దీంతో బీసీబీ ఇకపై బంగ్లా ఆటగాళ్ల కాంట్రాక్టు సమయంలోనే వేరే లీగ్స్ ఆడకుండా నిరోధించేలా నిబంధనలు తీసుకొని వచ్చింది. దీనిపై షకీబ్ స్పందిస్తూ..

‘వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికే ఇండియా, న్యూజీలాండ్ ఫైనల్ చేరిన తర్వాత ఈ మ్యాచ్‌లు నామమాత్రమే. కానీ ఈ ఏడాది ఇండియాలో టీ20 వరల్డ్ కప్ జరుగుతున్నది. ఐపీఎల్ ఆడటం వల్ల టీ20 వరల్డ్ కప్‌కు కూడా సిద్దమయినట్లు ఉంటుంది. కానీ బీసీబీ ఈ విషయాలేవీ ఆలోచించడం లేదు’ అని షకీబుల్ హసన్ ఆరోపించాడు. నేను టీ20 వరల్డ్ కప్ కోసమే ఐపీఎల్ ఆడదామని అనుకున్నాను. కానీ బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ అక్రమ్ మాత్రం తాను టెస్టులు ఆడటానికి ఇష్టపడటం లేదని ప్రచారం చేశారని షకీబ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News