శృంగారంపై షాకింగ్ కామెంట్స్ చేసిన యువకుడు.. వైరలవుతున్న వీడియో

దిశ, ఫీచర్స్: ప్రముఖ యూట్యూబర్, స్టాండప్ కమెడియన్, నటుడు వీర్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి టైమ్ వచ్చింది. గతంలో సామాజిక సమస్యలపై సెటైర్లు వేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసిన వీర్ దాస్.. ఈ సారి దేశంపై సెటైర్ వేస్తూ వీడియో అప్‌లోడ్ చేశాడు. లేటెస్ట్‌గా జాన్ ఎఫ్ కెన్నెడీ ‘డీసీ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ‘ఐ కమ్ ఫ్రమ్ టూ ఇండియాస్’ మోనోక్రోమ్‌‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎప్పటిలాగే తన […]

Update: 2021-11-18 02:54 GMT

దిశ, ఫీచర్స్: ప్రముఖ యూట్యూబర్, స్టాండప్ కమెడియన్, నటుడు వీర్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి టైమ్ వచ్చింది. గతంలో సామాజిక సమస్యలపై సెటైర్లు వేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసిన వీర్ దాస్.. ఈ సారి దేశంపై సెటైర్ వేస్తూ వీడియో అప్‌లోడ్ చేశాడు. లేటెస్ట్‌గా జాన్ ఎఫ్ కెన్నెడీ ‘డీసీ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ‘ఐ కమ్ ఫ్రమ్ టూ ఇండియాస్’ మోనోక్రోమ్‌‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎప్పటిలాగే తన ఒపీనియన్‌ను కొందరు సమర్థిస్తే.. మరికొందరు మాత్రం దేశాన్ని కించపరిచాడని, ‘దేశ ద్రోహి’ అని ముద్రవేశారు.

సాఫ్ట్ టెర్రరిజానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. అంత దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటూనే మరోవైపు భారీ సపోర్ట్ కూడా పొందుతున్న వీర్ దాస్.. ఇంతకీ ఈ వీడియోలో ఏం చెప్పాడు? ఏ విషయాల గురించి ప్రస్తావించాడు? భారత్‌పై ఏ లెవల్‌లో సెటైర్స్ వేశాడో చూద్దాం.

1. స్కూల్ పిల్లలు మాస్క్‌లు ధరించి షేక్ హ్యాండ్స్ ఇస్తుంటే.. లీడర్స్ మాత్రం మాస్క్‌లు లేకుండా ఏకంగా హగ్స్ ఇచ్చుకుంటున్నారు.

2. AQI 1000 ఉన్న ఇండియా నుంచి వచ్చాను కానీ, ఇప్పటికీ పైకప్పుపై నిద్రపోతూ నక్షత్రాలను చూస్తుంటాం.

3. నా భారతదేశంలో పగలంతా స్త్రీని కొలుస్తూనే రాత్రుళ్లు వారిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడుతుంటారు.

4. ట్విట్టర్‌లో బాలీవుడ్‌ను విభజించి విమర్శించే భారత్.. థియేటర్ల చీకటిలో బాలీవుడ్‌ ఒక్కటే అన్నట్లుగా మాట్లాడుతుంది.

5. శృంగారాన్ని ఎగతాళి చేస్తాం కానీ జనాభా బిలియన్‌ సంఖ్యకు చేరుకునే వరకు నిద్రపోం.

6. ఫ్యాన్సీ సూట్స్ ధరించే పురుషులు.. ఫ్యాన్సీ స్టూడియోస్, హ్యాండ్ జాబ్స్‌తో ఇండియాలో జర్నలిజం దాదాపు చచ్చిపోయింది. కానీ అదే సమయంలో రోడ్లపై లాప్‌టాప్‌తో దర్శనమిస్తున్న మహిళలు నిజాలు చెప్తున్నారు.

7. క్రికెట్‌లో బ్లూ జెర్సీ కోసం రక్తం కార్చుకునే మనం.. గ్రీన్ జెర్సీ(పాకిస్తాన్) గెలిస్తే వెంటనే కాషాయ రంగులోకి మారిపోతాం.

8. ఇంట్లో గట్టిగా నవ్వితే సౌండ్ పొల్యూషన్ గురించి ఆలోచించని జనం.. కామెడీ క్లబ్‌లో గట్టిగా నవ్వితే మాత్రం అక్కడి గోడలనే పగలగొట్టేస్తారు.

9. చనిపోయిన తండ్రి గురించి నిత్యం మాట్లాడే సీనియర్ పొలిటీషియన్స్ ఉన్న ఇండియాలో లివింగ్ మామ్స్‌ను ఫాలో అయ్యే యంగ్ లీడర్స్ కూడా ఉన్నారు.

10. భూమిపై లార్జెస్ట్ వర్కింగ్ పాపులేషన్(అండర్ 30) ఉన్నా సరే, ఇప్పటికీ 150 ఇయర్స్ ఓల్డ్ ఐడియాస్‌తో 75 ఏళ్ల వయసున్న లీడర్స్ చెప్పేదే వింటున్నాం.

11. మనం పీఎం కేర్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం.. కానీ పీఎంకేర్స్ మీద ఎలాంటి ఇన్‌ఫర్మేషన్ పొందలేమన్న ఇండియాలో ఉండటం శోచనీయం.

12. బ్రిటిష్‌ను తరిమికొట్టిన మనం గవర్నమెంట్‌ను కూడా రూలింగ్ పార్టీ అని పిలుస్తున్నాం.

Tags:    

Similar News