హెచ్‌యూఎల్ త్రైమాసిక లాభం రూ. 1,881 కోట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి, జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి స్వతంత్ర నికర లాభం 7.18 శాతం వృద్ధితో రూ. 1,881 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆ సంస్థ రూ. 1,755 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 4.23 శాతం పెరిగి రూ. 10,406 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు రూ. 9,984 […]

Update: 2020-07-21 09:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి, జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి స్వతంత్ర నికర లాభం 7.18 శాతం వృద్ధితో రూ. 1,881 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆ సంస్థ రూ. 1,755 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 4.23 శాతం పెరిగి రూ. 10,406 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు రూ. 9,984 కోట్లుగా ఉండేది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 10,716 కోట్లకు పెరిగిందని, గతేడాది ఇదే త్రైమాసికానికి రూ. 10,261 కోట్లని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ‘కొవిడ్-19 ప్రభావంతో మార్కెట్లు, కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడిందని, హెచ్‌యూఎల్ టర్నోవర్ వృద్ధి 4 శాతం, పన్ను అనంతర లాభాల్లో 7 శాతం వృద్ధిని సాధించినట్లు హెచ్‌యూఎల్ తెలిపింది. ఎబిటాకు ముందు ఆదాయం గతేడాదీ ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 2,647 కోట్ల నుంచి రూ. 2,644 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. ‘ఈ త్రైమాసికంలో కంపెనీ పనితీరు మెరుగ్గా ఉందని, అంతర్గత పతిష్టత, కార్యకలాపాల్లో ఉత్సాహం, బలమైన బ్యాలెన్స్ షీట్‌తో వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. ‘దేశంలో అనేక ప్రాంతాల్లో పరిమితుల కారణంగా అడ్డంకులు కొనసాగుతున్నప్పటికీ సమీప కాలంలో డిమాండ్‌కు అనిశ్చితి ఉన్నప్పటికీ, పోటీ, లాభదాయకతతో వృద్ధిని సాధించినట్టు, భారత ఎఫ్ఎంసీజీ రంగంలో దీర్ఘకాలంపాటు తమ స్థానం చెక్కు చెదరదని’ సంజీవ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News