బర్త్‌డే కేక్‌తో ‘క్రిష్’ జ్ఞాపకాలు..

బాలీవుడ్ గ్రీక్ వీరుడిగా.. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరుతెచ్చుకున్న హృతిక్ రోషన్.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతమనే చెప్పాలి. నమ్మశక్యం కాని డ్యాన్స్ మూమెంట్స్‌తో బాలీవుడ్‌ను షేక్ చేసిన హృతిక్.. ‘క్రిష్’ సిరీస్ సినిమాల్లో తన యాక్టింగ్, ఫైట్ సీక్వెన్స్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తినా సరే సినిమాను వదలని హృతిక్ గురించి అతని తల్లి ‘పింకీ రోషన్’ తాజాగా ఓ […]

Update: 2020-06-13 02:02 GMT

బాలీవుడ్ గ్రీక్ వీరుడిగా.. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరుతెచ్చుకున్న హృతిక్ రోషన్.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతమనే చెప్పాలి. నమ్మశక్యం కాని డ్యాన్స్ మూమెంట్స్‌తో బాలీవుడ్‌ను షేక్ చేసిన హృతిక్.. ‘క్రిష్’ సిరీస్ సినిమాల్లో తన యాక్టింగ్, ఫైట్ సీక్వెన్స్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తినా సరే సినిమాను వదలని హృతిక్ గురించి అతని తల్లి ‘పింకీ రోషన్’ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

హృతిక్ తొమ్మిదో పుట్టినరోజు పిక్ షేర్ చేసిన పింకీ రోషన్.. ‘హృతిక్‌ చిన్నప్పుడు తన బర్త్ డే కేక్‌ను ఏ షేప్‌లో డిజైన్ చేస్తున్నారో తెలుసుకోవాలని తెగ ఆరాటపడిపోయే వాడని’ తెలిపింది. ఈ పిక్‌లో తల్లి కేక్ అరేంజ్ చేస్తుండగా.. కంటి రెప్ప వాల్చకుండా చూస్తున్న హృతిక్ చాలా ముచ్చటగా ఉన్నాడు. తాజాగా దీనిపై స్పందించాడు హృతిక్.

అవును.. ‘చిన్నప్పుడు నా కేక్‌లు చాలా వరకు డిస్కో డ్యాన్సర్, సూపర్ హీరో, ఇళ్లు షేప్‌లో ఉండేవని’ తెలిపాడు. ఇక ఈ పిక్ చూసిన ఫ్యాన్స్.. ‘నీ కేక్ డిజైన్ ద్వారా నువ్వేంటో చెప్పేశావు’ అంటూ తెగ పొగిడేస్తున్నారు. నిజానికి హృతిక్ బెస్ట్ డ్యాన్సర్ మాత్రమే కాదు.. మా సూపర్ హీరో అని కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News