సొరకాయ పులుసు తయారు చేసుకోండిలా..

కావాల్సిన పదార్థాలు: సొరకాయలు -250 గ్రాములు ఉల్లిపాయలు -1 కప్పు పచ్చిమిర్చి -2 టమాటాలు -1 కారం -1 టేబుల్ స్పూన్ చింత పండు రసం -అర కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్ గరం మసాలా పొడి -అర స్పూన్ పసుపు – 1 టీస్పూన్ ఆవాలు, జీలకర్ర -2 టీస్పూన్స్ మెంతులు -అర టీస్పూన్ ఎండుమిర్చి -2 కరివేపాకు -2రెమ్మలు కొత్తిమీర -1 కప్పు ఉప్పు -తగినంత బెల్లం -రుచికి తగినంత (తీపిని […]

Update: 2021-02-12 02:07 GMT

కావాల్సిన పదార్థాలు:

సొరకాయలు -250 గ్రాములు
ఉల్లిపాయలు -1 కప్పు
పచ్చిమిర్చి -2
టమాటాలు -1
కారం -1 టేబుల్ స్పూన్
చింత పండు రసం -అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
గరం మసాలా పొడి -అర స్పూన్
పసుపు – 1 టీస్పూన్
ఆవాలు, జీలకర్ర -2 టీస్పూన్స్
మెంతులు -అర టీస్పూన్
ఎండుమిర్చి -2
కరివేపాకు -2రెమ్మలు
కొత్తిమీర -1 కప్పు
ఉప్పు -తగినంత
బెల్లం -రుచికి తగినంత (తీపిని తినేవారిని బట్టి)
నూనె -సరిపడినంతా

తయారీ విధానం:

ముందుగా సొరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను కుక్కర్‌లో వేసి చింతపండు రసం, తగినంత నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఈ పులుసు ఉడకుతుండగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తీపిని ఇష్టపడేవారు చివరగా బెల్లం కలుపుకుని దించుకోవాలి. ఇప్పుడు ఒక బాణిలో నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రేకులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. ఇందులో ముందుగా ఉడకబెట్టిన సొరకాయ మిశ్రమాన్ని వేసుకుని కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఈ పులుసులో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ పులుసు రెడీ..

టేస్టీ గోరుచిక్కుడు ఉల్లి మసాలా రెసిపీ

Tags:    

Similar News