అటుకుల పాయసం చేసుకొండిలా..

సేమ్యా పాయసం లాగా అటుకులతో కూడా పాయసం చేసుకోవచ్చు. అటుకుల పాయసం చాలా టేస్టీగా వుంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కావాల్సిన పదార్ధాలు: అటుకులు -ఒక కప్పు పాలు -రెండున్నర కప్పులు బెల్లం – అరకప్పు జీడిపప్పు – నాలుగు పలుకులు కొబ్బరి పొడి – రెండు టీస్పూన్లు యాలకులపొడి – అర టీస్పూన్‌ నెయ్యి – రెండు టీస్పూన్లు తయారీవిధానం: అటుకులను నీళ్లలో వేసి, ఓ నిమిషం తరువాత తీసేయాలి. నీళ్లు ఇంకా […]

Update: 2020-11-12 00:03 GMT

సేమ్యా పాయసం లాగా అటుకులతో కూడా పాయసం చేసుకోవచ్చు. అటుకుల పాయసం చాలా టేస్టీగా వుంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

కావాల్సిన పదార్ధాలు:

అటుకులు -ఒక కప్పు
పాలు -రెండున్నర కప్పులు
బెల్లం – అరకప్పు
జీడిపప్పు – నాలుగు పలుకులు
కొబ్బరి పొడి – రెండు టీస్పూన్లు
యాలకులపొడి – అర టీస్పూన్‌
నెయ్యి – రెండు టీస్పూన్లు

తయారీవిధానం:

అటుకులను నీళ్లలో వేసి, ఓ నిమిషం తరువాత తీసేయాలి. నీళ్లు ఇంకా ఉన్నట్లయితే అటుకులను పిండి నీళ్లు తీసేయాలి. ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక జీడిపప్పు వేసి వేగించాలి. దానిలో కొబ్బరి పొడి కూడా వేసి వేయించాలి. తర్వాత పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో తురుముకున్న బెల్లం వేయాలి. బెల్లం కరిగిన తరువాత అటుకులను వేసి ఉడికించుకోవాలి. చివరగా యాలకుల పొడి వేసి దింపుకుంటే అటుకుల పాయసం రెడీ. పాయసం వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

Tags:    

Similar News