గణపతిని నిలుపుతున్నారా.. అయితే ఇది తప్పని సరి

దిశ, భూపాలపల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని ప్రస్తుతం కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకుని గణేష్ మండప నిర్వాహకులు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తన ప్రకటనలో సూచించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. గణేష్ విగ్రహాలను ప్రధాన రహదారులు, […]

Update: 2021-09-06 01:41 GMT

దిశ, భూపాలపల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని ప్రస్తుతం కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకుని గణేష్ మండప నిర్వాహకులు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తన ప్రకటనలో సూచించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు.

గణేష్ విగ్రహాలను ప్రధాన రహదారులు, ప్రజలు తిరిగే రోడ్లపై, వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్‌కు ఎలాంటి అడ్డంకులు కలిగించకుండా ప్రతిష్టించే విధంగా చూడాలని సూచించారు. ఈ నెల 10వ తేదీన వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో సహా వివిధ గ్రామాల్లో ఆయా వీధులలో గణపతిని ప్రతిష్టించుకునే సంఘాలవారు http://policeportal.tspolice.gov.in లింక్ ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు. వినాయక విగ్రహాలు ప్రతిష్టించేందుకు, గణేష్ మండపం నిర్వహణకు, సంబంధించిన ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ కేవలం మండప నిర్వహణ, సమాచారం కోసం మాత్రమేనని, దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సి అవసరం లేదని తెలిపారు. వినాయక ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు నిర్దేశించిన లింకు ద్వారా విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రదేశం మొదలు నిమజ్జనం నిర్వహించే రోజు, సమయం, దారి, వివరాలను పొందుపరచాలని, విగ్రహం ప్రతిష్టించే స్థల యజమాని అనుమతి తీసుకున్న పత్రం జతపరచాలని తెలిపారు.

Tags:    

Similar News