ఈ రాశుల వారు ప్రేమకి దూరంగా ఉండటమే మంచిది.. ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు

ఏదైనా సంబంధంలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి.

Update: 2024-05-01 11:08 GMT

దిశ, ఫీచర్స్: ఏదైనా సంబంధంలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి. అయితే కొందరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. వివిధ రాశుల మధ్య అసమ్మతిని నిర్ణయించడంలో జ్యోతిషశాస్త్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనకి తెలియని విషయం ఏమిటంటే.. మనం ఎంత ప్రయత్నించిన కొన్ని బంధాలను అసలు కాపాడుకోలేము.. దీనికి కారణం ఇద్దరి రాశిచక్ర గుర్తుల స్థానం అని కూడా చెప్పవచ్చు. అయితే జ్యోతిష్యం, ఈ రాశుల వారు ప్రేమకి దూరంగా ఉండటమే మంచిదని చెబుతుంది. వారు ప్రేమించిన వారితోనే నిత్యం గొడవలు అవుతూనే ఉంటాయని అంటున్నారు. ఆ రాశుల జంటలేవో ఇక్కడ తెలుసుకుందాం..

కర్కాటకం, మకరం : కర్కాటక రాశి వారు చిన్న చిన్న విషయాలకే ఫీల్ అవుతుంటారు. మరో వైపు మకరం రాశి వారు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎదుటి వాళ్ల గురించి ఎక్కువ ఆలోచించరు. వారి అవసరాలు ఉన్నంత వరకే మనుషులతో మాట్లాడతారు. ఇది కర్కాటక రాశి వారికి అసలు నచ్చదు. దీని వల్ల ప్రేమలో ఉన్నవారు ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు.

సింహం, వృశ్చికం : సింహరాశి వారు మర్యాదను కోరుకుంటారు. వృశ్చిక రాశి వారు అన్ని విషయాలను లైట్ తీసుకుంటారు. అలాగే ఎవరైనా ఎదుగుతున్నా చూసి అసలు తీసుకోలేరు. వీరి మధ్య ప్రేమ కాదు కదా.. స్నేహం కూడా కష్టమే. ప్రేమ, రిలేషన్‌పై వారి విభిన్న విధానాల విభేదాలకు దారి తీయవచ్చు.

కన్య, ధనుస్సు : కన్య రాశి వారు అన్ని ఆలోచిస్తారు. స్పాంటేనిటీ కోరుకునే ధనుస్సు రాశి వారితో విభేదాలు ఎక్కువ ఉంటాయి. ధనుస్సు రాశిని చాలా నిర్లక్ష్యం చేస్తారు. వీరిద్దరి ఆలోచనలు ఎప్పటికి కలవలేవు. వీరి ప్రేమ సంబంధాలపై అపార్థాలకు దారితీయవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Similar News