నిందుతులను ఊపేక్షించేదిలేదు…!

దిశ, విశాఖపట్నం: విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని సోమవారం ఉన్నతాధికారులతో కలసి హోంమంత్రి సుచరిత పరామర్శించారు. రూ.10లక్షల ఆర్థికసాయం చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మ ప్రియ, సత్య గురునాథ్‌కు అందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ నిందుతులు ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదన్నారు. మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశా చట్టంతో 7రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేస్తామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని, నిందితుని […]

Update: 2020-11-02 09:30 GMT

దిశ, విశాఖపట్నం: విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని సోమవారం ఉన్నతాధికారులతో కలసి హోంమంత్రి సుచరిత పరామర్శించారు. రూ.10లక్షల ఆర్థికసాయం చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మ ప్రియ, సత్య గురునాథ్‌కు అందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ నిందుతులు ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదన్నారు. మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశా చట్టంతో 7రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేస్తామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని, నిందితుని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News