వామన్ రావుపై ఆయన క్లాస్‌మెట్ సంచలన ఆరోపణలు

దిశ ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు అడ్వోకేట్ గట్టు వామన్ రావుపై ఆయన క్లాస్‌మెట్ బండి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మంథనిలో ఆయన మాట్టాడుతూ… వామన్ రావు హత్యకు పాల్పడ్డ వారికి శిక్ష పడాలన్నారు. అయితే వామన్ రావు చేసిన అరాచకాలు కూడా అన్నిఇన్నీ కావన్నారు. వామన్ రావు చిన్నప్పటి నుంచి నేర స్వభావం కలిగిన వ్యక్తని ఆరోపించారు. తనకు 3.5 ఎకరాల భూమిలో సాగు చేస్తున్నామని, శిస్తు కూడా కడుతున్నామని వివరించారు. అయితే రెవెన్యూ […]

Update: 2021-02-20 03:48 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు అడ్వోకేట్ గట్టు వామన్ రావుపై ఆయన క్లాస్‌మెట్ బండి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మంథనిలో ఆయన మాట్టాడుతూ… వామన్ రావు హత్యకు పాల్పడ్డ వారికి శిక్ష పడాలన్నారు. అయితే వామన్ రావు చేసిన అరాచకాలు కూడా అన్నిఇన్నీ కావన్నారు. వామన్ రావు చిన్నప్పటి నుంచి నేర స్వభావం కలిగిన వ్యక్తని ఆరోపించారు. తనకు 3.5 ఎకరాల భూమిలో సాగు చేస్తున్నామని, శిస్తు కూడా కడుతున్నామని వివరించారు. అయితే రెవెన్యూ రికార్డులో వామన్ రావు కుటుంబ సభ్యుల పేరిట ఉందని తెలిసి తమ పేరిటకు మార్చాలని ఆయన తండ్రి కిషన్ రావును కోరితే ఆయన రూ.3 లక్షలు గుడ్ విల్ అడిగారన్నారు. కిషన్ రావు అన్న కూడా ఉన్నాడని తెలిసి ఆయనకు కాల్ చేస్తే.. మా తాత భూమి అమ్మాడని తనకు సంబంధం లేదని చెప్పాడన్నారు.

అయితే అనూహ్యంగా ఈ విషయంలో గట్టు వామన్ రావు ఎంటరై తనకే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఆరోపించారు. దీంతో తండ్రి కొడుకులకు డబ్బులు ఇవ్వకుండా మిన్నకుండిపోయామన్నారు. దీంతో వామన్ రావు తనతో పాటు మరో 25 మందిపై కేసులు వేశారన్నారు. ఇందులో పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులతో పాటు 80 ఏళ్ల వయసున్న తన తల్లి పేరును కూడా చేర్చాడన్నారు. నక్సలైట్లతో కుమ్మక్కై పోలీసు, వ్యవస్థను ప్రభావితం చేశామని వామన్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడని బండి శ్రీనివాస్ ఆరోపించారు. 80 ఏళ్ల వృద్ధురాలిపై కేసేందకన్న డీసీపీని హైకోర్టుకు వెళ్లి సస్పెండ్ చేయించారని తెలిపారు.

Tags:    

Similar News