ఏపీ హైకోర్టు ఇ‌న్‌చార్జీ రిజిస్ట్రార్ జనరల్ మృతి

దిశ ఏపీ బ్యూరో: ఆంధప్రదేశ్‌ హైకోర్టు ఇ‌న్‌చార్జీ రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ గుండెపోటుతో మృతి చెందారు. హైకోర్టులో విధులు నిర్వహిస్తుండగా బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌గా విశాఖపట్టణం జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి బీఎస్ భానుమతి నియమితులైన సంగతి తెలిసిందే. ఆమె చార్జీ తీసుకున్న మరుసటి రోజే రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందడం గమనార్హం

Update: 2020-06-24 05:23 GMT

Tags:    

Similar News