యువ హీరో ఉదయ్ కిరణ్ మృతి

        యంగ్ హీరో నండూరి ఉదయ్ కిరణ్ గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెనొప్పితో బాధపడిన అతన్ని కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూనే కన్నుమూశారు. అనంతరం ఉదయ్ భౌతిక కాయాన్ని రామారావుపేటలోని స్వగృహానికి తరలించారు. పలువురు సినీ ప్రముఖులు ఉదయ్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తిం చేశారు. యువహీరో హఠాత్తుగా మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు.      కాగా ఉదయ్ పరారే, […]

Update: 2020-02-15 01:35 GMT

యంగ్ హీరో నండూరి ఉదయ్ కిరణ్ గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెనొప్పితో బాధపడిన అతన్ని కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూనే కన్నుమూశారు. అనంతరం ఉదయ్ భౌతిక కాయాన్ని రామారావుపేటలోని స్వగృహానికి తరలించారు. పలువురు సినీ ప్రముఖులు ఉదయ్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తిం చేశారు. యువహీరో హఠాత్తుగా మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు.

కాగా ఉదయ్ పరారే, ఫ్రెండ్స్ బుక్ లాంటి తెలుగు సినిమాల్లో లీడ్ రోల్‌లో నటించాడు. పలు తమిళ సినిమాల్లోను అవకాశాలు దక్కించుకున్న ఉదయ్.. తర్వాత చెడు వ్యసనాలకు బానిసై కెరియర్‌ను నాశనం చేసుకున్నాడు. డ్రగ్స్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన ఉదయ్… సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని యువతిని మోసం చేసిన కేసులో మరో సారి అరెస్ట్ అయ్యాడు. 2016లో పబ్‌లో గొడవ, 2018లో ఇంటి ఓనర్‌పై దౌర్జన్యం కేసులోనూ అతనిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయ్. ఉదయ్ మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో కొన్నాళ్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స అందించారు.

Tags:    

Similar News